Posts

వేరేవాణ్ణి మెంటలోడనుకుని వితండవాదం చేస్తే ఇలాగే అవుతుంది

 పన్నెండు చక్రాల లారీకి న్యూట్రల్‌తో సహా 11 గేర్లు ఉంటాయి. పది చక్రాల టిప్పర్‌కి కూడా అన్నే గేర్లు ఉంటాయి. కొంత మంది ట్రాక్టర్ డ్రైవర్లు నన్ను మెంటలోడనుకుని ఏ బండికైనా ఐదే గేర్లు ఉంటాయని వాదించారు. "బండికి ఎన్ని చక్రాలు ఉంటే అన్ని గేర్లు ఉంటాయనుకున్నావా?" అని నన్ను వెక్కిరించారు. నేను యూట్యూబ్ వీడియోలు చూస్తే టాటా ట్రిపల్ ఏక్సల్ టిప్పర్‌కి కూడా 11 గేర్లు ఉంటాయని తెలిసింది. మహీంద్రా ట్రాక్టర్‌కి టాప్ గేర్‌లో రివర్స్‌తో సహా ఐదు గేర్లు ఉంటాయి, చిన్న గేర్‌లో న్యూట్రల్‌తో సహా మూడు గేర్లు ఉంటాయి. వీళ్ళు లారీకి కూడా ఐదే గేర్లు ఉంటాయనుకున్నారు. న్యూ హాలండ్ ట్రాక్టర్‌కి చిన్న గేర్ (లోడ్ గేర్) దగ్గరదగ్గరగా టాప్ గేర్ సైజ్‌లో ఉంటుంది. వీళ్ళు న్యూ హాలండ్ ట్రాక్టర్ డ్రైవర్లు. 2015లో మా ఊరి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌తో బస్సు తోలించారు, ఆ బస్సు పల్టీ అయ్యి డ్రైవర్‌తో సహా ఇద్దరు చనిపోయారు. దాని గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్లు నాతో వితండవాదం చేసారు. ట్రాక్టర్ ఇరుకైన ఘాట్ రోడ్‌లో కూడా సులభంగా టర్న్ అవుతుంది. బస్సు కూడా అంత సులభంగా టర్న్ అవుతుందని ఆ ట్రాక్టర్ డ్రైవర్ అనుకున్నాడ

దళితవాదులకి ఉన్న కామన్ సెన్స్ స్త్రీవాదులకి లేదా?

 ఆ మధ్య కలేకూరి ప్రసాద్ గారు "ఆంధ్ర ప్రదేశ్ దళితులు" అనే పుస్తకం రాసారు. కొంత మంది "ఈ రోజుల్లో కుల వివక్ష లేదు" అని చెప్పి రిజర్వేషన్‌ని రద్దు చెయ్యాలంటున్నారు, ఆట్రోసిటీ చట్టాన్ని కూడా రద్దు చెయ్యాలంటున్నారు. అలాంటివాళ్ళని కౌంటర్ చెయ్యడానికి కలేకూరి ప్రసాద్ గారు ఆ పుస్తకం రాసారు. మరి "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు" అని చెప్పి ఐ.పి.సి. 498ఎ ని రద్దు చెయ్యించాలనుకునేవాళ్ళ మీద స్త్రీవాదులకి ఇంత వ్యతిరేకత ఉందా? మా చిన్నప్పుడు స్వాతి అనే ఒక సపరివార బూతు పత్రికలో రాసేవాళ్ళు "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదట! జనం సెక్స్ గురించి ఫ్రీగా మాట్లాడుకుంటున్నారట!" ఇది నిజం అని నమ్మి ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడితే అతన్ని చెప్పుతో కొట్టేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా అలా కొడతారు. ఇలాంటి తప్పుడు ప్రోపగాండా చేసిన వేమూరి బలరాం మీద ఒక్క స్త్రీవాదికి కూడా కోపం లేదు. వేశ్యల దగ్గరకి వెళ్ళడం తప్పు కానీ ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పు కాదు. నేను ఎయిడ్స్ గురించి మాట్లాడితేనే "నిన్ను ఎవరు అడిగారు" అని నన్ను తిట్టినవాళ్ళు ఉన్నారు. మనం నిజంగా సెక్స్ గురించ

జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారా?

Image
జైలులో కైదీలకి బిర్యానీలు పెడతారు అనేది బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ ప్రోపగాండా. నేను ఐదు రోజులు జైలులో ఉన్నాను. జైలు కేంటీన్ క్రాంక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొనేసి దాన్ని వండి కైదీలకి పెడతాడని ఒక్క రోజు జైల్ ఫుడ్ తిన్నా అర్థమైపోతుంది. జైలులో పప్పు తినడం చాలా కష్టం. మనం ఇంట్లో చేపలు ఉల్లిపాయల మధ్య ఉడకబెట్టి వండుతాము. జైలు కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తాడు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికి కేంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఖర్చు తగ్గించుకోవడానికి చీప్ క్వాలిటీ ఫుడ్ వండుతాడు. వారానికి ఒకసారి మాంసం, చేపలు తినడానికి ఎవడూ జైలుకి వెళ్ళాలనుకోడు. బయట చేపలు వేపిన నూనె పప్పులో కలిపితే రిక్షావాడు కూడా తినడు. రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ జైలులో దొరుకుతుంది. నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. చిరంజీవి కొడుకు రేప్ చేసినా, రిక్షావాడి కొడుకు రేప్ చేసినా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే రేప్‌లు తప్పకుండా తగ్గుతాయి.   నేను ఉండినది ఒడిశా జైలులో. ఒడిశాలో బాపనోళ్ళు కూడా మాంసం తింటారు. జైనులు ఎక్

అది తెలంగాణ సినిమా అయితే ఎలాంటి మూఢనమ్మకాల్ని ప్రోత్సహించినా పర్వాలేదా?

Image
      పెన్మెత్స సుబ్బరాజు గారి ఈ పోస్ట్ చదివిన తెలంగాణ జనం ఆంధ్ర హేతువాదులు తెలంగాణ సినిమాపై విషం కక్కుతున్నారని ఏడుస్తున్నారు. ఆత్మలు కాకుల్లో దూరి పిండాలు తింటాయని నమ్మేవాళ్ళు ఆంధ్రలో కూడా ఉన్నారు. కేవలం ఒక తెలంగాణ సినిమాపై విషం కక్కాల్సిన అవసరం సుబ్బరాజు గారికి లేదు. మా ఒడిశాలో తాగుబోతు చస్తే అతని సమాధిలో సారా పేకెట్లు పాతుతారు. ఆత్మ పిండాల్ని తింటుందని ఆంధ్ర & తెలంగాణల్లో ఎలా నమ్ముతారో, ఆత్మ సారా తాగుతుందని ఒడిశా జనం అలాగే నమ్ముతారు. నేను మా ఒడిశా సంస్కృతి పేరుతో ఇక్కడి నమ్మకాలకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నోరు మూసుకోలేదే.

గన్ లైసెన్సింగ్ అక్రమాల పై నా యూట్యూబ్ వీడియోని డిలీట్ చెయ్యించిన ఆంధ్ర పోలీసులు

 గన్ లైసెన్సింగ్ అక్రమాల పై నేను పెట్టిన యూట్యూబ్ వీడియో డిలీట్ అయ్యింది. నేను ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తున్నానని నాకు యూట్యూబ్ మోడరేటర్స్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ యూట్యూబ్ వీడియోలో నా గన్ లైసెన్స్ అప్లికేషన్‌కి ఎంక్లోజ్ చేసిన డాక్యుమెంట్లే షేర్ చేసాను. వేరేవాళ్ళ డాక్యుమెంట్లు నేను షేర్ చెయ్యలేదు. ఆ డాక్యుమెంట్ల మీద నా పేరు, ఫొటోలు ఉన్నాయి. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి నేను నా వ్యక్తిగత సమాచారం ఇవ్వగలను కానీ వేరేవాళ్ళది ఎలా ఇవ్వగలను?   పైరసీ సినిమాలని డిలీట్ చెయ్యడం చేతకానివాళ్ళు పోలీసులకి భయపడి నా సొంత వీడియోని డిలీట్ చేసారు.

గన్ లైసెన్సింగ్ పేరుతో జనాన్ని ఫూల్ చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ హోమ్ శాఖ (Part 1)

ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం BJP అభిమానులకి అవసరమా?

 మన వ్యక్తిగత శత్రువులు ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకుందాం. "వాళ్ళు ఎలా పోతే మనకెందుకు?" అనుకుంటాం. మరి మన రాజకీయ శత్రువుకి ఎవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చెయ్యొచ్చా? సంజయ్ గాంధీ ఫిరోజ్ గాంధీకే పుట్టాడు. అతను పుట్టిన 14 ఏళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు, తరువాత అతని తండ్రి చనిపోయాడు. ఇందిరా గాంధీ ఒక ఆర్మీ ఆఫీసర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని సంజయ్ గాంధీని కనిందని వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నవాళ్ళ మీద నెహ్రు కుటుంబ సభ్యులు పరువు నష్టం కేస్ వెయ్యలేదు కానీ మోదీ అనే ఇంటి పేరుని రాహుల్ గాంధీ కించపరిచాడని BJP ప్రభుత్వం అతనికి రెండేళ్ళు జైలు శిక్ష వెయ్యించింది. మనం వేరే వాళ్ళ గురించి ఎంత చెత్త ప్రోపగాండా అయినా చెయ్యగలిగినప్పుడు వాళ్ళు మన ఇంటి పేరుని ఉచ్చరిస్తే మాత్రం సహించలేమా? దున్నపోతు ఈనింది అని ఒకడంటే ఇంకొకడు దూడని కట్టెయ్యమన్నాడు. సంజయ్ గాంధీ పుట్టిన పద్నాలుగేళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు. అతని తల్లి మొగుణ్ణి వదిలేసి ఒక ఆర్మీ ఆఫీసర్‌కి అతన్ని కనిందని ఎవరో రాస్తే మిగితావాళ్ళు అన్‌క్రిటికల్‌గా నమ్మేసారు. మన శత్రువులు అక్రమ సంబంధాలు పెట్టుకుం