మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?

రేపిస్టులని ఎంకౌంటర్ చెయ్యాలని సోషల్ మీడియాలో ప్రతివాడు అరుస్తాడు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారని కూడా వీళ్ళు ఏడుస్తారు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపేంత బడ్జెట్ జైళ్ళ శాఖ ఐ.జి.కి ఉండదు అని వీళ్ళకి తెలియదు. 

 ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో ప్రాసిక్యూటర్ ఒక రాజభక్తుడు కానీ అతని తండ్రి రాజద్రోహి నెపోలియన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆ రహస్యం బయటపడకూడదని ప్రాసిక్యూటర్ హీరోని విచారణ లేకుండానే శాతో దీఫ్ అనే చీకటి చెరసాలలో కైదు చేస్తాడు. 1815లో ప్రపంచంలోని ఏ దేశంలోనూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు. అప్పట్లో ప్రాసిక్యూటర్‌కి ఇలాంటి తప్పులు చెయ్యడం సాధ్యమే. రేపిస్టులని విచారణ లేకుండా ఎంకౌంటర్ చేసి మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా? 

ఇండియాలో అదే పరిస్థితి వస్తే ఏమవుతుంది? పిచ్చిదాయి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వదనుకుని ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పిచ్చిదాన్ని రేప్ చేసాడనుకుందాం. ఆ రేప్‌ని చూసినవాణ్ణి ఆ పోలీస్ ఆఫీసర్ బూటకపు ఎంకౌంటర్లో చంపడని గ్యారంటీ ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడు నక్సల్ లీడర్. ఆ ఆఫీసర్ తన తమ్ముణ్ణి సరెండర్ చెయ్యించలేకపోయాడు. ఈ రహస్యం తెలిసినవాణ్ణి కూడా ఆ ఆఫీసర్ చంపడని గ్యారంటీ ఏమిటి? బూటకపు ఎంకౌంటర్లు చేసే ఆఫీసర్లకి ఎంకౌంటర్ స్పెషలిస్ట్ లాంటి బిరుదులు ఇవ్వడం ఎలాగైనా ప్రమాదకరమే.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది