జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారా?

జైలులో కైదీలకి బిర్యానీలు పెడతారు అనేది బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ ప్రోపగాండా. నేను ఐదు రోజులు జైలులో ఉన్నాను. జైలు కేంటీన్ క్రాంక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొనేసి దాన్ని వండి కైదీలకి పెడతాడని ఒక్క రోజు జైల్ ఫుడ్ తిన్నా అర్థమైపోతుంది. జైలులో పప్పు తినడం చాలా కష్టం. మనం ఇంట్లో చేపలు ఉల్లిపాయల మధ్య ఉడకబెట్టి వండుతాము. జైలు కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తాడు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికి కేంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఖర్చు తగ్గించుకోవడానికి చీప్ క్వాలిటీ ఫుడ్ వండుతాడు. వారానికి ఒకసారి మాంసం, చేపలు తినడానికి ఎవడూ జైలుకి వెళ్ళాలనుకోడు. బయట చేపలు వేపిన నూనె పప్పులో కలిపితే రిక్షావాడు కూడా తినడు. రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ జైలులో దొరుకుతుంది. నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. చిరంజీవి కొడుకు రేప్ చేసినా, రిక్షావాడి కొడుకు రేప్ చేసినా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే రేప్‌లు తప్పకుండా తగ్గుతాయి.

 


నేను ఉండినది ఒడిశా జైలులో. ఒడిశాలో బాపనోళ్ళు కూడా మాంసం తింటారు. జైనులు ఎక్కువగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో జైల్‌లలో మాంసం వండుతారో లేదో తెలియదు. బిర్యానీలు మాత్రం ఏ జైలులోనూ పెట్టరు. పెద్దపెద్ద హోటెల్‌వాడు కూడా లూజ్ పామాయిల్‌తో వంట చేస్తాడు, మునిసిపాలిటీ హెల్త్ ఇన్స్‌పెక్టర్ వస్తే రిఫైన్డ్ ఆయిల్ డబ్బాలు చూపిస్తాడు. జైలులో రిఫైన్డ్ ఆయిల్‌తో వంట చెయ్యాలని రూల్ పెడితే జైల్ కేంటీన్‌వాడు రిఫైన్డ్ ఆయిల్ డబ్బాల్లో పామాయిల్ నింపేసి జైల్ సూపరింటెండెంట్‌కి చూపించగలడు.

వేరే దేశాల్లోని జైల్‌లలో కూడా కూడు చెత్తగా ఉంటుంది. మలేసియాలో జైల్‌కి వెళ్ళి వచ్చిన ఒక ముస్లిం మత పెద్ద అన్నాడు, తనకి జైల్‌లో ఇచ్చిన సూప్ రుచి పైప్ నీళ్ళదిలాగ ఉందట. చమురు, గ్యాస్ లాంటి పరిశ్రమలతో అభివృద్ధి చెందిన మలేసియా లాంటి దేశంలో జైలు కూడు ఇంత చీప్ క్వాలిటీతో ఉంటే ఇండియా లాంటి వెనుకబడిన దేశంలో కైదీలకి బిర్యానీలు ఎందుకు మేపుతారు? అంత బడ్జెట్ ఇక్కడి జైళ్ళ శాఖ ఐ.జి.లకి ఉండదు.

 

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది