మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

2017లో నేను ఒడిశాలోని ఒక ఆదివాసీ గ్రామం దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు ఒక కాపువాడు తారసపడ్డాడు. అప్పుడు నా వయసు 34 ఏళ్ళు. అతను నాకు పెళ్ళయ్యిందా అని అడిగాడు. కాలేదని చెప్పాను. అతను నమ్మలేదు. అతను అన్నాడు "ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. ఆ కులంలో ఆడపిల్లలు తక్కువ (రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుడితే పాలు సరిగా పట్టరు). వ్యవసాయం చేసేవాళ్ళలో ఆడపిల్లలకి అంత కరువు ఉండదు" అని. అతను చెప్పింది నాకు అర్థమైపోయింది. హిందు మతం అనేది కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టినది. కోమటోళ్ళు, బాపనోళ్ళలో ఆడపిల్లల సంఖ్య తక్కువే ఉంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని ఈనాడు పత్రికలో రాస్తే మా అమ్మ నమ్మేసింది. మా అమ్మగారి తండ్రి చేసినది వ్యవసాయమే కానీ మా అమ్మ బాపనోళ్ళ అమ్మాయిల కలిసి చదువుకుంది. వ్యవసాయం చేసేవాళ్ళ సంస్కృతి మా అమ్మకి తెలియదు.

 2013లో ఈనాడు పత్రికలో మెయిన్ పేజ్‌లోనే ఒక ఆర్టికల్ ప్రచురితమయ్యింది. ఆ ఆర్టికల్‌లో వ్యవసాయం చేసేవాళ్ళకి, నిరుద్యోగులకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని రాసారు. వ్యవసాయం చేసేవాళ్ళు వేరు, నిరుద్యోగులు వేరు. ఇండియాలోని నిరుద్యోగుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలనుకునేవాళ్ళు. వాళ్ళకి ఉద్యోగాలు రావు, వ్యవసాయం చేత కాదు. నేను చేసేది మూడెకరాల వ్యవసాయం. మా ఊరిలోనే ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు నిరుద్యోగి. అతను తన తండ్రి బతికున్నప్పుడు బ్రాందీ తాగేవాడు. తన తండ్రి చనిపోయిన తరువాత అతను నా దగ్గరే నాటు సారా అడుక్కున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశపడితే జీవితం ఇలాగే నాశనం అవుతుంది. అతని తండ్రి బతికున్నప్పుడే అతనికి పెళ్ళయ్యింది. తండ్రి చనిపోయిన తరువాత అతని భార్య అతని మీద 498a కేసు పెట్టింది. అతని తల్లి పెళ్ళి భోజనాల్లో వంటలు చేసి సంపాదించిన డబ్బుల్ని లాయర్‌కి కట్టి రెండు నెలల తరువాత అతనికి బెయిల్ చెయ్యించింది. నిరుద్యోగుల జీవితాల కంటే వ్యవసాయం చేసేవాళ్ళ లైఫ్ స్టైల్ చాలా గొప్పగా ఉంటుంది. ఈనాడు పత్రిక కాంట్రిబ్యూటర్లు మాత్రం వ్యవసాయం చేసేవాళ్ళు నిరుద్యోగులతో సమానం అనే అర్థంతో ఆర్టికల్ రాసారు.

 

నేను మా అమ్మకి జెండర్ సెన్సిటైజేషన్ కలిగించడానికి ప్రయత్నించాను. విజయవాడ చుట్టుపక్కల వ్యవసాయం చేసే కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు తక్కువ. ఈనాడు ఎడిటర్ రామోజీరావుది విజయవాడ దగ్గర గుడివాడ. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఎడిటర్‌కి చెందిన పత్రికలో ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అని రాస్తే నువ్వు ఎలా నమ్మేసావు అని అడిగాను. మా అమ్మగారి తండ్రి MP అతను పెద్ద రాజకీయ నాయకుడు కావడం వల్ల తన ఇంటిలోని ఆడపిల్లలు ఎవరినీ గడప దాటి బయటికి వెళ్ళనివ్వలేదు. అందుకే అతని కూతుర్లకి సమాజం గురించి తెలియకుండా పోయింది. 

 ఐ.టి. ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో ఆడపిల్లల సంఖ్య 10% మాత్రమే. మీరు ఏ మేట్రిమోనియల్ వెబ్‌సైట్ చూసినా అందులో మగపిల్లల ప్రొఫైల్స్ ఎక్కువగా ఉంటాయి.

రిజర్వేషన్ కులాల్లో చదువుకున్నవాళ్ళు తక్కువ. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళలో కోమటోళ్ళు, బాపనోళ్ళు, కమ్మవాళ్ళు, వెలమదొరలే ఎక్కువగా ఉంటారు. 2013లో ఈనాడువాళ్ళు కమ్మవాళ్ళు & వెలమదొరల్లో ఆడపిల్లల తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి, వాళ్ళ సాక్ష్యం ఆధారంగా వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని నిరూపించడానికి ప్రయత్నించారు.

 చంద్రబాబు నాయుడు ఎలెక్షన్ అఫిడేవిట్‌లో తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు, ముఖ్యమంత్రి అయిన తరువాత వ్యవసాయం వేస్టు అని ప్రచారం చేసేవాడు. హైదరాబాద్‌లో అతని బిల్డింగ్ చూసినవాళ్ళు ఎవరూ అతన్ని మూడెకరాల రైతు అనుకోరు. రామోజీ రావుకి వ్యవసాయం తెలియదు. అతను తన టివి చానెల్‌లో వ్యవసాయదారుల కార్యక్రమాల్ని కంట్రిబ్యూటర్ల చేత చెయ్యిస్తాడు. చంద్రబాబు నాయుడుకి కుప్పం దగ్గర రెండు వేల ఎకరాల బేనామీ వ్యవసాయ భూమి ఉంది. అందులో అతను ఇజ్రాయెలీ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నాడు. అతను జనం దగ్గర మాత్రం వ్యవసాయం వేస్టు, ఐ.టి.యే బెస్టు అని ప్రచారం చేసేవాడు. అలాంటోణ్ణి గెలిపించడానికి ఈనాడు పత్రిక ఎన్ని పాట్లైనా పడుతుంది.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది