Posts

Showing posts from 2023

వేరేవాణ్ణి మెంటలోడనుకుని వితండవాదం చేస్తే ఇలాగే అవుతుంది

 పన్నెండు చక్రాల లారీకి న్యూట్రల్‌తో సహా 11 గేర్లు ఉంటాయి. పది చక్రాల టిప్పర్‌కి కూడా అన్నే గేర్లు ఉంటాయి. కొంత మంది ట్రాక్టర్ డ్రైవర్లు నన్ను మెంటలోడనుకుని ఏ బండికైనా ఐదే గేర్లు ఉంటాయని వాదించారు. "బండికి ఎన్ని చక్రాలు ఉంటే అన్ని గేర్లు ఉంటాయనుకున్నావా?" అని నన్ను వెక్కిరించారు. నేను యూట్యూబ్ వీడియోలు చూస్తే టాటా ట్రిపల్ ఏక్సల్ టిప్పర్‌కి కూడా 11 గేర్లు ఉంటాయని తెలిసింది. మహీంద్రా ట్రాక్టర్‌కి టాప్ గేర్‌లో రివర్స్‌తో సహా ఐదు గేర్లు ఉంటాయి, చిన్న గేర్‌లో న్యూట్రల్‌తో సహా మూడు గేర్లు ఉంటాయి. వీళ్ళు లారీకి కూడా ఐదే గేర్లు ఉంటాయనుకున్నారు. న్యూ హాలండ్ ట్రాక్టర్‌కి చిన్న గేర్ (లోడ్ గేర్) దగ్గరదగ్గరగా టాప్ గేర్ సైజ్‌లో ఉంటుంది. వీళ్ళు న్యూ హాలండ్ ట్రాక్టర్ డ్రైవర్లు. 2015లో మా ఊరి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌తో బస్సు తోలించారు, ఆ బస్సు పల్టీ అయ్యి డ్రైవర్‌తో సహా ఇద్దరు చనిపోయారు. దాని గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్లు నాతో వితండవాదం చేసారు. ట్రాక్టర్ ఇరుకైన ఘాట్ రోడ్‌లో కూడా సులభంగా టర్న్ అవుతుంది. బస్సు కూడా అంత సులభంగా టర్న్ అవుతుందని ఆ ట్రాక్టర్ డ్రైవర్ అనుకున్నాడ

దళితవాదులకి ఉన్న కామన్ సెన్స్ స్త్రీవాదులకి లేదా?

 ఆ మధ్య కలేకూరి ప్రసాద్ గారు "ఆంధ్ర ప్రదేశ్ దళితులు" అనే పుస్తకం రాసారు. కొంత మంది "ఈ రోజుల్లో కుల వివక్ష లేదు" అని చెప్పి రిజర్వేషన్‌ని రద్దు చెయ్యాలంటున్నారు, ఆట్రోసిటీ చట్టాన్ని కూడా రద్దు చెయ్యాలంటున్నారు. అలాంటివాళ్ళని కౌంటర్ చెయ్యడానికి కలేకూరి ప్రసాద్ గారు ఆ పుస్తకం రాసారు. మరి "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు" అని చెప్పి ఐ.పి.సి. 498ఎ ని రద్దు చెయ్యించాలనుకునేవాళ్ళ మీద స్త్రీవాదులకి ఇంత వ్యతిరేకత ఉందా? మా చిన్నప్పుడు స్వాతి అనే ఒక సపరివార బూతు పత్రికలో రాసేవాళ్ళు "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదట! జనం సెక్స్ గురించి ఫ్రీగా మాట్లాడుకుంటున్నారట!" ఇది నిజం అని నమ్మి ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడితే అతన్ని చెప్పుతో కొట్టేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా అలా కొడతారు. ఇలాంటి తప్పుడు ప్రోపగాండా చేసిన వేమూరి బలరాం మీద ఒక్క స్త్రీవాదికి కూడా కోపం లేదు. వేశ్యల దగ్గరకి వెళ్ళడం తప్పు కానీ ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పు కాదు. నేను ఎయిడ్స్ గురించి మాట్లాడితేనే "నిన్ను ఎవరు అడిగారు" అని నన్ను తిట్టినవాళ్ళు ఉన్నారు. మనం నిజంగా సెక్స్ గురించ

జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారా?

Image
జైలులో కైదీలకి బిర్యానీలు పెడతారు అనేది బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ ప్రోపగాండా. నేను ఐదు రోజులు జైలులో ఉన్నాను. జైలు కేంటీన్ క్రాంక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొనేసి దాన్ని వండి కైదీలకి పెడతాడని ఒక్క రోజు జైల్ ఫుడ్ తిన్నా అర్థమైపోతుంది. జైలులో పప్పు తినడం చాలా కష్టం. మనం ఇంట్లో చేపలు ఉల్లిపాయల మధ్య ఉడకబెట్టి వండుతాము. జైలు కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తాడు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికి కేంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఖర్చు తగ్గించుకోవడానికి చీప్ క్వాలిటీ ఫుడ్ వండుతాడు. వారానికి ఒకసారి మాంసం, చేపలు తినడానికి ఎవడూ జైలుకి వెళ్ళాలనుకోడు. బయట చేపలు వేపిన నూనె పప్పులో కలిపితే రిక్షావాడు కూడా తినడు. రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ జైలులో దొరుకుతుంది. నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. చిరంజీవి కొడుకు రేప్ చేసినా, రిక్షావాడి కొడుకు రేప్ చేసినా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే రేప్‌లు తప్పకుండా తగ్గుతాయి.   నేను ఉండినది ఒడిశా జైలులో. ఒడిశాలో బాపనోళ్ళు కూడా మాంసం తింటారు. జైనులు ఎక్

అది తెలంగాణ సినిమా అయితే ఎలాంటి మూఢనమ్మకాల్ని ప్రోత్సహించినా పర్వాలేదా?

Image
      పెన్మెత్స సుబ్బరాజు గారి ఈ పోస్ట్ చదివిన తెలంగాణ జనం ఆంధ్ర హేతువాదులు తెలంగాణ సినిమాపై విషం కక్కుతున్నారని ఏడుస్తున్నారు. ఆత్మలు కాకుల్లో దూరి పిండాలు తింటాయని నమ్మేవాళ్ళు ఆంధ్రలో కూడా ఉన్నారు. కేవలం ఒక తెలంగాణ సినిమాపై విషం కక్కాల్సిన అవసరం సుబ్బరాజు గారికి లేదు. మా ఒడిశాలో తాగుబోతు చస్తే అతని సమాధిలో సారా పేకెట్లు పాతుతారు. ఆత్మ పిండాల్ని తింటుందని ఆంధ్ర & తెలంగాణల్లో ఎలా నమ్ముతారో, ఆత్మ సారా తాగుతుందని ఒడిశా జనం అలాగే నమ్ముతారు. నేను మా ఒడిశా సంస్కృతి పేరుతో ఇక్కడి నమ్మకాలకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నోరు మూసుకోలేదే.

గన్ లైసెన్సింగ్ అక్రమాల పై నా యూట్యూబ్ వీడియోని డిలీట్ చెయ్యించిన ఆంధ్ర పోలీసులు

 గన్ లైసెన్సింగ్ అక్రమాల పై నేను పెట్టిన యూట్యూబ్ వీడియో డిలీట్ అయ్యింది. నేను ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తున్నానని నాకు యూట్యూబ్ మోడరేటర్స్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ యూట్యూబ్ వీడియోలో నా గన్ లైసెన్స్ అప్లికేషన్‌కి ఎంక్లోజ్ చేసిన డాక్యుమెంట్లే షేర్ చేసాను. వేరేవాళ్ళ డాక్యుమెంట్లు నేను షేర్ చెయ్యలేదు. ఆ డాక్యుమెంట్ల మీద నా పేరు, ఫొటోలు ఉన్నాయి. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి నేను నా వ్యక్తిగత సమాచారం ఇవ్వగలను కానీ వేరేవాళ్ళది ఎలా ఇవ్వగలను?   పైరసీ సినిమాలని డిలీట్ చెయ్యడం చేతకానివాళ్ళు పోలీసులకి భయపడి నా సొంత వీడియోని డిలీట్ చేసారు.

గన్ లైసెన్సింగ్ పేరుతో జనాన్ని ఫూల్ చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ హోమ్ శాఖ (Part 1)

ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం BJP అభిమానులకి అవసరమా?

 మన వ్యక్తిగత శత్రువులు ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకుందాం. "వాళ్ళు ఎలా పోతే మనకెందుకు?" అనుకుంటాం. మరి మన రాజకీయ శత్రువుకి ఎవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చెయ్యొచ్చా? సంజయ్ గాంధీ ఫిరోజ్ గాంధీకే పుట్టాడు. అతను పుట్టిన 14 ఏళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు, తరువాత అతని తండ్రి చనిపోయాడు. ఇందిరా గాంధీ ఒక ఆర్మీ ఆఫీసర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని సంజయ్ గాంధీని కనిందని వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నవాళ్ళ మీద నెహ్రు కుటుంబ సభ్యులు పరువు నష్టం కేస్ వెయ్యలేదు కానీ మోదీ అనే ఇంటి పేరుని రాహుల్ గాంధీ కించపరిచాడని BJP ప్రభుత్వం అతనికి రెండేళ్ళు జైలు శిక్ష వెయ్యించింది. మనం వేరే వాళ్ళ గురించి ఎంత చెత్త ప్రోపగాండా అయినా చెయ్యగలిగినప్పుడు వాళ్ళు మన ఇంటి పేరుని ఉచ్చరిస్తే మాత్రం సహించలేమా? దున్నపోతు ఈనింది అని ఒకడంటే ఇంకొకడు దూడని కట్టెయ్యమన్నాడు. సంజయ్ గాంధీ పుట్టిన పద్నాలుగేళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు. అతని తల్లి మొగుణ్ణి వదిలేసి ఒక ఆర్మీ ఆఫీసర్‌కి అతన్ని కనిందని ఎవరో రాస్తే మిగితావాళ్ళు అన్‌క్రిటికల్‌గా నమ్మేసారు. మన శత్రువులు అక్రమ సంబంధాలు పెట్టుకుం

నా వెనుక నాగావళి నది, రాయగడ పట్టణం

Image
 ఇది రాయగడ పట్టణం దగ్గర బాయిసింగ్ కొండ నుంచి తీసిన ఫొటో  

జాతకాలు చెప్పుకుని బతికిన సైంటిస్ట్ - టైకో బ్రాహి

 జ్యోతిషం వేరు, ఖగోళ శాస్త్రం వేరు. ఒకప్పుడు సైంటిస్టులు కూడా జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు, కొంత మంది సైంటిస్టులు జాతకాలు చెప్పుకుని బతికేవాళ్ళు కూడా. అలాంటివాళ్ళలో ఒకడు టైకో బ్రాహి. సూర్య గ్రహణం ప్రతి 177 రోజులు 4 గంటలకి ఒకసారి జరుగుతుంది. కొన్ని సార్లు సంవత్సరానికి ఐదు సూర్య గ్రహణాలు జరుగుతాయి కానీ అలాంటి సంవత్సరాలు గత ఐదు వేల సంవత్సరాల కాలంలో 25 మాత్రమే. ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిషులు వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డులు సంపాదించి గ్రహణాలు ఎప్పుడొస్తాయో చెప్పగలుగుతుంటారు. ఈ విషయం తెలియక జనం జ్యోతిషులని అపర మేధావులు అనుకుంటారు. గ్రహణాలు చూడకూడదని మనం నమ్ముతాము కానీ జ్యోతిషులు గ్రహణాలు చూస్తారు. ఒక రోజు టైకో బ్రాహి సూర్య గ్రహణం చూస్తున్నప్పుడు గ్రహణాలు సైక్లికల్‌గా జరుగుతుంటాయని అతనికి డౌట్ వచ్చింది. అతను వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డుల్ని సంపాదించి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను తురక చక్రవర్తి సులేమాన్ చంద్ర గ్రహణం రోజు చస్తాడని జాతకం చెప్పాడు. అప్పట్లో యూరోపియన్ రాజులకీ, తురక సామ్రాజ్యవాదులకీ మధ్య యుద్ధాలు జ

నేను కొత్తగా కడుతున్న కోట - ద శాతో ఆఫ్ ఎడ్మండ్ డాంటిస్

Image
ఫ్రెంచ్ భాషలో శాతో అంటే కోట. నా ఫేవరిట్ హీరో ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలోని ఎడ్మండ్ డాంటిస్. అందుకే నా ఫాం హౌస్‌కి ద శాతో ఆఫ్ ఎడ్మండ్ డాంటిస్ అని పేరు పెట్టాను.   

పెళ్ళిలో బ్రాహ్మణుల వండింది తిని దళితుల పాకలో మద్యం తాగుతారు

కొంత మంది పెళ్ళి భోజనాలలో బ్రాహ్మణుల చేతే వంట చెయ్యిస్తారు. బ్రాహ్మణులు పరిశుభ్రంగా వండుతారని వాళ్ళ నమ్మకం. బ్రాహ్మణులు నడిపే హొటెల్స్‌లో కూడా లూజ్ పామాయిల్‌తో వంట చేస్తారు తప్ప రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడరు. ఒడియా, బెంగాలీ, కశ్మీరీ, కోంకణీ & కేరళ బ్రాహ్మణులు మాంసం తింటారు. ఒడిశాలోని రాయగడ పట్టణంలో పెళ్ళి భోజనాల్లో వంటలు చేసేవాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు. వాళ్ళు పెళ్ళి భోజనాల్లో మాంసం వండుతారు కానీ అన్‌హెల్దీ కండిషన్‌లో. మనం ఇంటిలో చేపల్ని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి మధ్య ఉడకబెడతాం. పెళ్ళి భోజనాల్లో వంటలు చేసేవాళ్ళు చేపల్ని నూనెలో ముంచి వేపుతారు, వేస్ట్ నూనెని వంకాయల్లో కలుపుతారు. ఆ వంకాయల్ని పెరుగులో ముంచి అవి పెరుగువంకాయలని చెప్పి అతిథులకి పెడతారు. జైల్ కీంటీన్ కాంట్రాక్టర్లు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు వేస్ట్ నూనెని పప్పులో కలుపుతారు. కైదీలకీ, విద్యార్థులకీ వేరే దారి దొరక్క ఆ ఫుడ్ తింటారు. పంచముడు వండిన ఆహారం తినకూడదు అని మనం అనుకుంటాము కానీ పంచముడి కుటీరంలో మద్యం తాగేటప్పుడు అలాంటి పట్టింపులు అడ్డురావు. మా పక్క గ్రామంలోనే సొంత వ్యవసాయ భూమి ఉన్న కులంవాళ్ళు భూమి లేని పం

కొజ్జా అనే పదాన్ని నిషేధించడం వల్ల హిజ్రా వృత్తి మాయమవ్వదు

 నేను రాయగడ సబ్ జెయిల్‌లో ఉన్నప్పుడు నాకు అక్కడ పాపు అనే దొంగ పరిచయమయ్యాడు. అతను రాయగడ సబ్ జెయిల్‌తో పాటు కోరాపుట్ సెంట్రల్ జెయిల్, పాట్నా జెయిల్‌లలో కూడా గడిపాడు. ఒకసారి రైల్వే పోలీసులు ట్రెయిన్లలో పాసింజర్లని హెరాస్ చేస్తున్న హిజ్రాలని రాయగడ సబ్ జెయిల్‌కి తీసుకొచ్చారని చెప్పాడు. ఆ హిజ్రాలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళో కూడా చెప్పాడు. జెయిల్‌లో కైదీలు కేంటీన్‌లో సబ్బులు, సిగరెట్లు కొనుక్కోవడానికి కొంత డబ్బు ఉంచుకుంటారు. ఆ పైసలు కోసం హిజ్రాలు కైదీలని హెరాస్ చేసేవాళ్ళు. హిజ్రాలు కైదీలని తమతో పడుకోమని బలవంతం కూడా చేసేవాళ్ళు. వాళ్ళతో పడుకుంటే ఎయిడ్స్ వస్తుందనే భయం వల్ల కైదీలు వాళ్ళతో పడుకునేవాళ్ళు కాదు, జెయిలర్స్‌కి కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు. ఆ జెయిల్‌లో ఒక సెల్‌కి పాతిక నుంచి యాభై మంది కైదీలు ఉంటారు, పెద్దపెద్ద దొంగల్ని నలుగురైదుగురు ఉండే సెల్స్‌లో పెడతారు లేదా ఒంటరి సెల్స్‌లో పెడతారు. సిగ్గు విడిచి పాతిక మంది చూస్తుండగా హిజ్రాతో పడుకుంటే ఏ ఎయిడ్స్ వస్తుందో, సిఫిలిస్ వస్తుందో, గనేరియా వస్తుందో అనే భయం కైదీలకి ఉండేది. హిజ్రాలు జైలులో నీళ్ళ కుండీల దగ్గర టవల్ కట్టుకోకుండా నగ్నంగా స్నానం చేసేవాళ్ళు. వ

పాక్సొ (మైనర్‌తో సెక్స్) కేసులు ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి?

పాక్సొ కేసు నిందితుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు. నాకు జైలులో పరిచయమైన పాక్సొ కేసు నిందితుల్లో కొందరు తాము అమ్మాయిని తీసుకెళ్ళాం కానీ రేప్ చెయ్యలేదు అంటున్నారు, కొందరు అమ్మాయి వయసు ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేసినవాళ్ళు. బాల్య వివాహం కోసం అమ్మాయిని తీసుకెళ్తే కిడ్నాప్ కేస్ మాత్రమే ఋజువు అవుతుంది, పాక్సో కేస్ ఋజువు అవ్వదు. ఎవడైనా తాను అమ్మాయి వయసు ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేసానని చెపితే కోర్ట్ నమ్మదు. అతను కోర్ట్‌లో తాను ఆ పని చెయ్యలేదని చెపుతాడు. పాక్సో కేసు ఋజువైతే మినిమం మూడేళ్ళు కారాగార శిక్ష పడుతుంది. గుప్త రోగం అంటిస్తే మాక్సిమం జీవిత కారాగార శిక్ష పడుతుంది. గర్భం మొయ్యలేని వికలాంగురాలికి కడుపు చేసినా జీవిత కారాగార శిక్ష పడుతుంది. గుప్త రోగం అంటించకపోయినా లాయర్ పాక్సో కేస్ నిందితుడికి అరవైడబ్బై  వేలు ఫీ అడుగుతాడు, వికలాంగురాలికి కడుపు చెయ్యకపోయినా లాయర్ అంతే ఫీ అడుగుతాడు. పేదవాడు అంత ఫీ కట్టలేడు, లాయర్ ఫీ ఇవ్వకపోతే వాదించడు. నిందితుడి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకి రాకపోతే నిందితుడి స్టేట్మెంట్ రెకార్డ్ చేసి కేస్ విచారిస్తారు. అయినప్పటికీ లాయర్‌ని పెట్టుకోవడానికి కోర్ట్ నిందితుడికి

కథని కథలా మాత్రమే చూడాలనే సెన్స్ లేని యూనివర్సిటీ ప్రొఫెసర్లు మనకి సైన్స్ నేర్పిస్తున్నారు

  ఇస్రొ సైంటిస్ట్ వి. శ్రీనివాస చక్రవర్తి గారు చెప్పినట్టు గుర్తింది, "కాన్స్టెలేషన్స్ (నక్షత్ర మండలాలు) ఊహాజనితం, చంద్రుడి మీద నుంచి చూస్తే కాన్స్టెలేషన్స్ వేరే ఆకారంలో కనిపిస్తాయి" అని. ఇంత తెలిసిన సైంటిస్టులు కూడా సైన్స్ తెలియని పంతులు పెట్టిన ముహూర్తం ప్రకారం పెళ్ళి చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంత సైన్స్ తెలుసుకుని ఏమి లాభం? ప్రపంచం మొత్తం పదార్థంతో నిర్మితమైనది. మరి పదార్థం కాని దేవుణ్ణి సైంటిస్టులు ఎలా నమ్ముతున్నారు? ఈ సందేహం చాలా మంది హేతువాదుల్లో ఉంది. గాజులు బానిసలకి వేసిన చేతి సంకెళ్ళ నుంచి పరిణామం చెందాయని చాలా మంది స్త్రీవాద రచయిత్రులకి తెలియదు. స్త్రీవాద రచయిత్రులు కూడా చేతులకి గాజులు తొడుక్కుని మీటింగ్‌లలో స్త్రీ-పురుష సమానత్వం గురించి మాట్లాడుతారు. హిందు పురాణాల్లోనూ, బైబిల్‌లోనూ నక్షత్రాలు మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు కథలు ఉన్నాయి. కథలు వేరు, వాస్తవం వేరు అని సైంటిస్టులు అంటారు కానీ ఆ కథలు ఎందుకు రాసారో సైంటిస్టులకి తెలియదు. పెన్మెత్స సుబ్బరాజు అనే హేతువాది అన్నారు "సైంటిస్టులు తమ రంగంలో మాత్రమే మేధావులు, తమ రంగం బయట వాళ్ళకి సాధారణ జనంతో సమానమైన తెల

రిజర్వేషన్ పేరుతో జనాన్ని ఫూల్ చేస్తున్న ప్రభుత్వం

 రిజర్వేషన్ కులాల్లో చదువుకున్నవాళ్ళు తక్కువ. నేను ఉండే రాయగడ జిల్లాలోనే బి.సి. కోటాలో టీచర్ పోస్టులు ఖాళీ మిగిలిపోతున్నాయి. ఒడిశాలో ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వాలంటే +2(12th క్లాస్) & OTET పాస్ అవ్వాలి. రిజర్వేషన్ కులాల్లీ టెంత్ క్లాస్ చదివినవాళ్ళు కూడా తక్కువ. వాళ్ళు తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా ఇంటి పనులు చూసుకోవడానికి స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిపోతారు. అగ్రకులాలవాళ్ళ పిల్లల్ని చదువుకోమని అందరూ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డ్రాపౌట్ సమస్య రాదు. ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. ఆ కులంలో ఆడపిల్లలు తక్కువ, చదువుకున్నవాళ్ళు ఎక్కువ. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళలో కోమటోళ్ళు, బాపనోళ్ళు ఎక్కువగా ఉంటారు. చదువురానివాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ గురించి తెలియదు. లిటరసీ రేట్ తక్కువ ఉన్న కులాల్లో ఫీమేల్ సెక్స్ రేషియో ఎక్కువే ఉంటుంది. రిజర్వేషన్ కులాలవాళ్ళు ఆడపిల్లల్ని చిన్న వయసులోనే కూలీ పనులకి పంపిస్తారు. రిజర్వేషన్ కులాల్లో ఆడపిల్లల సంఖ్య ఎక్కువే కానీ చదువుకున్న స్త్రీల సంఖ్య తక్కువ ఉంటుంది. రిజర్వేషన్ వల్ల కులాల జీవన ప్రమాణాలు మారవు అనేది నిజం.

సేటిలైట్ కెమెరాలకి ఎకె47 దొరికిపోతుందా?

Image
ఈ ఫొటోలో 0.177 కేలిబర్ ఎయిర్ పిస్తోల్ పట్టుకున్నది నేనే. కొంత మంది అంటుంటారు, ఎకె 47 పట్టుకుని తిరిగితే సేటిలైట్ కెమెరాకి దొరికిపోతావు అని. సేటిలైట్ కెమెరాలు AK47ని గుర్తించలేవు. సేటిలైట్ కెమెరాకి మనిషే ఒక చుక్క లాగ కనిపిస్తాడు. అతని చేతిలో ఎకె47 ఉందో, కార్ బేరింగ్ రాడ్ ఉందో ఆ కెమెరా గుర్తించలేదు. ఈ ఆదివారం నేను విశాఖపట్నంలో జన విజ్ఞాన వేదిక మీటింగ్‌కి వెళ్ళాను. సేటిలైట్ కెమెరాకి వీరప్పన్ అయినా పారప్పన్ అయినా ఒకేలాగ కనిపిస్తారు అని ఒక ఇస్రో సైంటిస్ట్ చెప్పాడు. చంబల్ లోయ బందిపోట్లు రోజూ ఎకె47 పట్టుకుని తిరుగుతారు. వాళ్ళందరూ సేటిలైట్ కెమెరాలకి దొరికిపోతున్నారా?

తనకి పాలు పోసి పెంచిన సంఘసంస్కర్తల మీద విషం కక్కుతున్న శ్రీరెడ్డి

Image
 

ప్రభుత్వ ఉద్యోగులది ఏ వర్గం?

 పోలీస్ స్టేషన్లు, కోర్టులు లేకపోతే ప్రభుత్వం కొన్ని రోజులు కూడా బతకదు. అయినా పోలీస్ కానిస్టేబుల్ జీతం సీనియారిటీని బట్టి ఇరవై వేలు నుంచి నలభై వేలు మాత్రమే, కోర్టు గుమాస్తా జీతం పదిహేను వేలు నుంచి ముప్పై వేలు మాత్రమే. విచిత్రం ఏమిటంటే నలభై వేల నుంచి ఎనభై వేలు జీతం తీసుకునే టీచర్లు సమ్మె చేస్తారు తప్ప కానిస్టేబుళ్ళు, కోర్టు గుమాస్తాలు సమ్మె చెయ్యరు.  పారిశ్రామిక కార్మికులు సమ్మె చేస్తే ఈ కానిస్టేబుళ్ళ చేతే లాఠీలతో కొట్టిస్తారు. జీతం బాకీలు ఎగ్గొట్టిన మేనేజర్‌కి కార్మికులు గట్టిగా అడిగితే మేనేజర్ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు, అప్పుడు ఈ కానిస్టేబుళ్ళే వచ్చి అరెస్ట్ చేస్తారు. నాకు జైలులోని పక్క సెల్‌లో ఒక లారీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతను బాల్కొ అలుమినియం ఫాక్టరీలో డ్రైవర్ పని చేసాడు. అతని మేనేజర్ అతనికి పదమూడు వేలు జీతం ఇస్తామని చెప్పి పదకొండు వేలే ఇచ్చాడు. ఆ మేనేజర్ తొమ్మిది మంది కార్మికుల్ని ఇలాగే మోసం చేసాడు. గట్టిగా అడిగినందుకు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపాడు. వాళ్ళలో కొందరికి బెయిల్ వచ్చింది, కొందరికి బెయిల్ రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఈ సమస్య ఉండదు. వాళ్ళకి జీ

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

Image
 సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు. నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం వల్

ఆ పని చేస్తే చెరసాల పాలు అవ్వడమే కాదు, ఆస్తి కూడా జప్తు అవుతుంది

 భక్త రామదాసుని చెరసాలలో పెట్టింది అబ్దుల్లాహ్ కుతుబ్‌షాహ్ కానీ అతన్ని వదిలేసింది అబ్దుల్లాహ్ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్. సినిమాలు, నాటకాలలో రామదాసుని చెరసాలలో పెట్టింది, వదిలేసినది ఒకే కుతుబ్‌షాహ్‌గా చూపిస్తారు. రామదాసు మేనమామలు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్ దగ్గర మంత్రులుగా పని చేసారు. రామదాసు చెరసాలకి వెళ్ళిన సమయంలో (1668లో) అబ్దుల్లాహ్ రాజుగా ఉండేవాడు. అక్కన్న, మాదన్నలు అబుల్ హసన్‌ని ఒప్పించి రామదాసుని విడిపించి ఉంటారు కానీ అబుల్ హసన్ వ్యక్తిగతంగా ఏమంత గొప్పవాడు కాదు. అతను మద్యం తాగుతూ మదవతులతో పడుకునేవాడు. రాజు అనుమతి లేకుండా రాజు గారి డబ్బులతో గుడి కట్టినందుకు అబ్దుల్లాహ్ రామదాసుని చెరసాలలో పెట్టాడు కానీ అతను గుడిలోని నగలని జప్తు చెయ్యలేదు. రాజు తలుచుకుంటే ఆ పని కష్టం కాదు. అబ్దుల్లాహ్ దయగలవాడు కావడం వల్ల ఆ పని చెయ్యలేదు. రామదాసుని క్షమిస్తే మరి కొంత మంది రాజు గారి డబ్బులు దుర్వినియోగం చేస్తారు కనుక రాజు రామదాసుని చెరసాలలో పెట్టాడు. ఇప్పుడు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఎవడైనా ప్రభుత్వ సొమ్ముతో గుడి కడితే అతన్ని అరెస్ట్ చెయ్యడంతో పాటు అతని ఆస్తిని జప్తు చేస్తారు. ఒక వ్యక్తి మీద ఎ.సి.బి. కే

హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదా?

 హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదని నమ్మేవాళ్ళలో కొంత మంది న్యాయమూర్తులు కూడా ఉన్నారు. రేప్‌కి గురైన హిందు స్త్రీకి పెళ్ళి సంబంధం దొరక్కపోవచ్చు కానీ తప్పుడు రేప్ కేస్ పెట్టేవాళ్ళకి ఆ సమస్య రాదు, రేప్ జరగలేదని ఆమె బంధువులకి గానీ ఆమె కులపువాళ్ళకి గానీ తెలిసినట్టైతే. రాయగడ సబ్-జెయిల్‌లో నాకు ఒక రేప్ కేస్ నిందితుడు పరిచయమయ్యాడు. అతను ఒక రాజకీయ నాయకుడి కూతురిని ప్రేమించాడు. అతనికి పదెకరాలు భూమి ఉంది, ఆ అమ్మాయికి ఇరవై ఎకరాలు ఉంది. ఇద్దరిదీ ఒకే కులం, ఒకే వీధి. అతను తన లవర్‌తో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు అతన్ని పట్టుకుని ఆమె చేత రేప్ కేస్ పెట్టించారని అతను అన్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. వీర్యాన్ని టెస్ట్‌లకి పంపించారన్నాడు. వీర్యపు మరకలు ఉన్నా బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. అతనిది గౌడ (గోపాళ) కులం. ఆ కులంవాళ్ళ వృత్తి పశువులు మేపడం కానీ ఆ కులంలో 25 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని వదిలించుకుంటే ఇతని కంటే ఎక్కువ భూమి ఉన్న సంబంధం దొరుకుతుందని అమ్మాయి తల్లితండ్రుల ప్లాన్ కావచ్చు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్. ఆ కేస్‌లో

సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి సారా వ్యాపారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చెయ్యగలరా?

 సారా వ్యాపారం చేసేవాడు పోలీసులకి దొరికిపోతే అతను వేరే వ్యాపారం చూసుకుంటాడు. అలాగే వేశ్యలు పోలీసులకి దొరికిపోతే వాళ్ళు వేరే వ్యాపారం చెయ్యలేరా? స్త్రీ జనోద్ధారకులు వేశ్యావృత్తిని చట్టబద్దం చెయ్యాలంటారు కానీ సారా వ్యాపారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చెయ్యరు. సారా వ్యాపారం చేసేది కూడా పేదవాళ్ళే. సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి ఎవరూ ప్రయత్నించరు కానీ వేశ్యల్ని ఉద్ధరించడానికి మాత్రం సంఘాలు పుట్టుకొస్తాయి. వేశ్యతో పడుకున్నవాడికి కండోమ్ జారిపోయి గుప్తరోగం అంటితే వాడి చికిత్సకి వీళ్ళు డబ్బులు ఇస్తారా? రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసిన సారా తాగితే మనిషి ఎక్కువ కాలం బతకడు. అమ్మోనియాతో కల్తీ చేసిన సారా తాగితే ఆకలి తగ్గిపోతుంది. గుప్తరోగం అంత తొందరగా తగ్గదు, మూడు సార్లు గుప్తరోగం అంటినవాడు కూడా ఎంత కాలం బతుకుతాడో తెలియదు. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే వేశ్యలతో పడుకున్నవాళ్ళని ఉద్దరించినట్టు కూడా అవ్వదు.