Posts

Showing posts from January, 2023

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

Image
 సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు. నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం వల్

ఆ పని చేస్తే చెరసాల పాలు అవ్వడమే కాదు, ఆస్తి కూడా జప్తు అవుతుంది

 భక్త రామదాసుని చెరసాలలో పెట్టింది అబ్దుల్లాహ్ కుతుబ్‌షాహ్ కానీ అతన్ని వదిలేసింది అబ్దుల్లాహ్ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్. సినిమాలు, నాటకాలలో రామదాసుని చెరసాలలో పెట్టింది, వదిలేసినది ఒకే కుతుబ్‌షాహ్‌గా చూపిస్తారు. రామదాసు మేనమామలు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్ దగ్గర మంత్రులుగా పని చేసారు. రామదాసు చెరసాలకి వెళ్ళిన సమయంలో (1668లో) అబ్దుల్లాహ్ రాజుగా ఉండేవాడు. అక్కన్న, మాదన్నలు అబుల్ హసన్‌ని ఒప్పించి రామదాసుని విడిపించి ఉంటారు కానీ అబుల్ హసన్ వ్యక్తిగతంగా ఏమంత గొప్పవాడు కాదు. అతను మద్యం తాగుతూ మదవతులతో పడుకునేవాడు. రాజు అనుమతి లేకుండా రాజు గారి డబ్బులతో గుడి కట్టినందుకు అబ్దుల్లాహ్ రామదాసుని చెరసాలలో పెట్టాడు కానీ అతను గుడిలోని నగలని జప్తు చెయ్యలేదు. రాజు తలుచుకుంటే ఆ పని కష్టం కాదు. అబ్దుల్లాహ్ దయగలవాడు కావడం వల్ల ఆ పని చెయ్యలేదు. రామదాసుని క్షమిస్తే మరి కొంత మంది రాజు గారి డబ్బులు దుర్వినియోగం చేస్తారు కనుక రాజు రామదాసుని చెరసాలలో పెట్టాడు. ఇప్పుడు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఎవడైనా ప్రభుత్వ సొమ్ముతో గుడి కడితే అతన్ని అరెస్ట్ చెయ్యడంతో పాటు అతని ఆస్తిని జప్తు చేస్తారు. ఒక వ్యక్తి మీద ఎ.సి.బి. కే

హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదా?

 హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదని నమ్మేవాళ్ళలో కొంత మంది న్యాయమూర్తులు కూడా ఉన్నారు. రేప్‌కి గురైన హిందు స్త్రీకి పెళ్ళి సంబంధం దొరక్కపోవచ్చు కానీ తప్పుడు రేప్ కేస్ పెట్టేవాళ్ళకి ఆ సమస్య రాదు, రేప్ జరగలేదని ఆమె బంధువులకి గానీ ఆమె కులపువాళ్ళకి గానీ తెలిసినట్టైతే. రాయగడ సబ్-జెయిల్‌లో నాకు ఒక రేప్ కేస్ నిందితుడు పరిచయమయ్యాడు. అతను ఒక రాజకీయ నాయకుడి కూతురిని ప్రేమించాడు. అతనికి పదెకరాలు భూమి ఉంది, ఆ అమ్మాయికి ఇరవై ఎకరాలు ఉంది. ఇద్దరిదీ ఒకే కులం, ఒకే వీధి. అతను తన లవర్‌తో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు అతన్ని పట్టుకుని ఆమె చేత రేప్ కేస్ పెట్టించారని అతను అన్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. వీర్యాన్ని టెస్ట్‌లకి పంపించారన్నాడు. వీర్యపు మరకలు ఉన్నా బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. అతనిది గౌడ (గోపాళ) కులం. ఆ కులంవాళ్ళ వృత్తి పశువులు మేపడం కానీ ఆ కులంలో 25 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని వదిలించుకుంటే ఇతని కంటే ఎక్కువ భూమి ఉన్న సంబంధం దొరుకుతుందని అమ్మాయి తల్లితండ్రుల ప్లాన్ కావచ్చు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్. ఆ కేస్‌లో

సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి సారా వ్యాపారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చెయ్యగలరా?

 సారా వ్యాపారం చేసేవాడు పోలీసులకి దొరికిపోతే అతను వేరే వ్యాపారం చూసుకుంటాడు. అలాగే వేశ్యలు పోలీసులకి దొరికిపోతే వాళ్ళు వేరే వ్యాపారం చెయ్యలేరా? స్త్రీ జనోద్ధారకులు వేశ్యావృత్తిని చట్టబద్దం చెయ్యాలంటారు కానీ సారా వ్యాపారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చెయ్యరు. సారా వ్యాపారం చేసేది కూడా పేదవాళ్ళే. సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి ఎవరూ ప్రయత్నించరు కానీ వేశ్యల్ని ఉద్ధరించడానికి మాత్రం సంఘాలు పుట్టుకొస్తాయి. వేశ్యతో పడుకున్నవాడికి కండోమ్ జారిపోయి గుప్తరోగం అంటితే వాడి చికిత్సకి వీళ్ళు డబ్బులు ఇస్తారా? రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసిన సారా తాగితే మనిషి ఎక్కువ కాలం బతకడు. అమ్మోనియాతో కల్తీ చేసిన సారా తాగితే ఆకలి తగ్గిపోతుంది. గుప్తరోగం అంత తొందరగా తగ్గదు, మూడు సార్లు గుప్తరోగం అంటినవాడు కూడా ఎంత కాలం బతుకుతాడో తెలియదు. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే వేశ్యలతో పడుకున్నవాళ్ళని ఉద్దరించినట్టు కూడా అవ్వదు.