సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి సారా వ్యాపారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చెయ్యగలరా?

 సారా వ్యాపారం చేసేవాడు పోలీసులకి దొరికిపోతే అతను వేరే వ్యాపారం చూసుకుంటాడు. అలాగే వేశ్యలు పోలీసులకి దొరికిపోతే వాళ్ళు వేరే వ్యాపారం చెయ్యలేరా? స్త్రీ జనోద్ధారకులు వేశ్యావృత్తిని చట్టబద్దం చెయ్యాలంటారు కానీ సారా వ్యాపారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చెయ్యరు. సారా వ్యాపారం చేసేది కూడా పేదవాళ్ళే. సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి ఎవరూ ప్రయత్నించరు కానీ వేశ్యల్ని ఉద్ధరించడానికి మాత్రం సంఘాలు పుట్టుకొస్తాయి. వేశ్యతో పడుకున్నవాడికి కండోమ్ జారిపోయి గుప్తరోగం అంటితే వాడి చికిత్సకి వీళ్ళు డబ్బులు ఇస్తారా? రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసిన సారా తాగితే మనిషి ఎక్కువ కాలం బతకడు. అమ్మోనియాతో కల్తీ చేసిన సారా తాగితే ఆకలి తగ్గిపోతుంది. గుప్తరోగం అంత తొందరగా తగ్గదు, మూడు సార్లు గుప్తరోగం అంటినవాడు కూడా ఎంత కాలం బతుకుతాడో తెలియదు. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే వేశ్యలతో పడుకున్నవాళ్ళని ఉద్దరించినట్టు కూడా అవ్వదు.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది