హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదా?
హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదని నమ్మేవాళ్ళలో కొంత మంది న్యాయమూర్తులు కూడా ఉన్నారు. రేప్‌కి గురైన హిందు స్త్రీకి పెళ్ళి సంబంధం దొరక్కపోవచ్చు కానీ తప్పుడు రేప్ కేస్ పెట్టేవాళ్ళకి ఆ సమస్య రాదు, రేప్ జరగలేదని ఆమె బంధువులకి గానీ ఆమె కులపువాళ్ళకి గానీ తెలిసినట్టైతే.
రాయగడ సబ్-జెయిల్‌లో నాకు ఒక రేప్ కేస్ నిందితుడు పరిచయమయ్యాడు. అతను ఒక రాజకీయ నాయకుడి కూతురిని ప్రేమించాడు. అతనికి పదెకరాలు భూమి ఉంది, ఆ అమ్మాయికి ఇరవై ఎకరాలు ఉంది. ఇద్దరిదీ ఒకే కులం, ఒకే వీధి. అతను తన లవర్‌తో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు అతన్ని పట్టుకుని ఆమె చేత రేప్ కేస్ పెట్టించారని అతను అన్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. వీర్యాన్ని టెస్ట్‌లకి పంపించారన్నాడు. వీర్యపు మరకలు ఉన్నా బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. అతనిది గౌడ (గోపాళ) కులం. ఆ కులంవాళ్ళ వృత్తి పశువులు మేపడం కానీ ఆ కులంలో 25 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని వదిలించుకుంటే ఇతని కంటే ఎక్కువ భూమి ఉన్న సంబంధం దొరుకుతుందని అమ్మాయి తల్లితండ్రుల ప్లాన్ కావచ్చు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్. ఆ కేస్‌లో బెయిల్ తొందరగా రాదు. అతనికి బెయిల్ వచ్చేలోపు ఆ అమ్మాయిని ఇంకొకడికి ఇచ్చి పెళ్ళి చేసేస్తారు. ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో విలన్ హీరోని రాజద్రోహ అభియోగంలో ఇరికించి, శాతో దీఫ్‌కి పంపించి, తన చిన్నాన్న కూతురిని పెళ్ళి చేసుకుంటాడు. ఆ నవలలో ఎడ్మండ్ డాంటిస్ పద్నాలుగేళ్ళు చీకటి చెరసాలలో గడుపుతాడు, ఇక్కడ ఈ రేప్ కేస్ నిండితుడు బెయిల్ కోసం పడిగాపులు కాస్తూ రెండుమూడేళ్ళు సబ్-జెయిల్‌లో ఇన్‌డీసెంట్ ఫుడ్ తింటాడు. నేను ఐదు రోజులు జైలులో రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ తిన్నాను. ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిందో లేదో నాకు తెలియదు. మా పక్క ఊరిలో ఒకడు 18 ఏళ్ళు దాటిన అమ్మాయిని తీసుకెళ్ళాడు. అతని మీద చిన్న పిల్లలతో సెక్స్ కేస్ పెట్టారు, మూడేళ్ళైనా అతనికి బెయిల్ రాలేదు. ఇలాంటి నిజజీవితపు ఎడ్మండ్ డాంటిస్‌లు ఎంత మంది ఉన్నారో?
Comments
Post a Comment