కొజ్జా అనే పదాన్ని నిషేధించడం వల్ల హిజ్రా వృత్తి మాయమవ్వదు
నేను రాయగడ సబ్ జెయిల్‌లో ఉన్నప్పుడు నాకు అక్కడ పాపు అనే దొంగ పరిచయమయ్యాడు. అతను రాయగడ సబ్ జెయిల్‌తో పాటు కోరాపుట్ సెంట్రల్ జెయిల్, పాట్నా జెయిల్‌లలో కూడా గడిపాడు. ఒకసారి రైల్వే పోలీసులు ట్రెయిన్లలో పాసింజర్లని హెరాస్ చేస్తున్న హిజ్రాలని రాయగడ సబ్ జెయిల్‌కి తీసుకొచ్చారని చెప్పాడు. ఆ హిజ్రాలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళో కూడా చెప్పాడు. జెయిల్‌లో కైదీలు కేంటీన్‌లో సబ్బులు, సిగరెట్లు కొనుక్కోవడానికి కొంత డబ్బు ఉంచుకుంటారు. ఆ పైసలు కోసం హిజ్రాలు కైదీలని హెరాస్ చేసేవాళ్ళు. హిజ్రాలు కైదీలని తమతో పడుకోమని బలవంతం కూడా చేసేవాళ్ళు. వాళ్ళతో పడుకుంటే ఎయిడ్స్ వస్తుందనే భయం వల్ల కైదీలు వాళ్ళతో పడుకునేవాళ్ళు కాదు, జెయిలర్స్‌కి కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు. ఆ జెయిల్‌లో ఒక సెల్‌కి పాతిక నుంచి యాభై మంది కైదీలు ఉంటారు, పెద్దపెద్ద దొంగల్ని నలుగురైదుగురు ఉండే సెల్స్‌లో పెడతారు లేదా ఒంటరి సెల్స్‌లో పెడతారు. సిగ్గు విడిచి పాతిక మంది చూస్తుండగా హిజ్రాతో పడుకుంటే ఏ ఎయిడ్స్ వస్తుందో, సిఫిలిస్ వస్తుందో, గనేరియా వస్తుందో అనే భయం కైదీలకి ఉండేది. హిజ్రాలు జైలులో నీళ్ళ కుండీల దగ్గర టవల్ కట్టుకోకుండా నగ్నంగా స్నానం చేసేవాళ్ళు. వ