సేటిలైట్ కెమెరాలకి ఎకె47 దొరికిపోతుందా?

ఈ ఫొటోలో 0.177 కేలిబర్ ఎయిర్ పిస్తోల్ పట్టుకున్నది నేనే. కొంత మంది అంటుంటారు, ఎకె 47 పట్టుకుని తిరిగితే సేటిలైట్ కెమెరాకి దొరికిపోతావు అని. సేటిలైట్ కెమెరాలు AK47ని గుర్తించలేవు. సేటిలైట్ కెమెరాకి మనిషే ఒక చుక్క లాగ కనిపిస్తాడు. అతని చేతిలో ఎకె47 ఉందో, కార్ బేరింగ్ రాడ్ ఉందో ఆ కెమెరా గుర్తించలేదు. ఈ ఆదివారం నేను విశాఖపట్నంలో జన విజ్ఞాన వేదిక మీటింగ్‌కి వెళ్ళాను. సేటిలైట్ కెమెరాకి వీరప్పన్ అయినా పారప్పన్ అయినా ఒకేలాగ కనిపిస్తారు అని ఒక ఇస్రో సైంటిస్ట్ చెప్పాడు. చంబల్ లోయ బందిపోట్లు రోజూ ఎకె47 పట్టుకుని తిరుగుతారు. వాళ్ళందరూ సేటిలైట్ కెమెరాలకి దొరికిపోతున్నారా?

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది