ప్రభుత్వ ఉద్యోగులది ఏ వర్గం?

 పోలీస్ స్టేషన్లు, కోర్టులు లేకపోతే ప్రభుత్వం కొన్ని రోజులు కూడా బతకదు. అయినా పోలీస్ కానిస్టేబుల్ జీతం సీనియారిటీని బట్టి ఇరవై వేలు నుంచి నలభై వేలు మాత్రమే, కోర్టు గుమాస్తా జీతం పదిహేను వేలు నుంచి ముప్పై వేలు మాత్రమే. విచిత్రం ఏమిటంటే నలభై వేల నుంచి ఎనభై వేలు జీతం తీసుకునే టీచర్లు సమ్మె చేస్తారు తప్ప కానిస్టేబుళ్ళు, కోర్టు గుమాస్తాలు సమ్మె చెయ్యరు. 

పారిశ్రామిక కార్మికులు సమ్మె చేస్తే ఈ కానిస్టేబుళ్ళ చేతే లాఠీలతో కొట్టిస్తారు. జీతం బాకీలు ఎగ్గొట్టిన మేనేజర్‌కి కార్మికులు గట్టిగా అడిగితే మేనేజర్ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు, అప్పుడు ఈ కానిస్టేబుళ్ళే వచ్చి అరెస్ట్ చేస్తారు. నాకు జైలులోని పక్క సెల్‌లో ఒక లారీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతను బాల్కొ అలుమినియం ఫాక్టరీలో డ్రైవర్ పని చేసాడు. అతని మేనేజర్ అతనికి పదమూడు వేలు జీతం ఇస్తామని చెప్పి పదకొండు వేలే ఇచ్చాడు. ఆ మేనేజర్ తొమ్మిది మంది కార్మికుల్ని ఇలాగే మోసం చేసాడు. గట్టిగా అడిగినందుకు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపాడు. వాళ్ళలో కొందరికి బెయిల్ వచ్చింది, కొందరికి బెయిల్ రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఈ సమస్య ఉండదు. వాళ్ళకి జీతం లేట్ అయితే పబ్లిక్ గ్రీవెన్స్ ఇస్తే చాలు, జీతం అకౌంట్లో పడిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగులే మేనేజర్ల మోసాల గురించి అడిగితే జైలు పాలు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెల్ని వ్యతిరేకించినందుకు విప్లవ కవి శివసాగర్ మేనకోడలు గిడ్ల సుజాత నన్ను ఫేస్‌బుక్‌లో బ్లాక్ చేసింది. ఆమెకి ప్రైవేట్ ఉద్యోగుల మీద అంత ప్రేమ ఉండదు. 


Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది