పాక్సొ (మైనర్‌తో సెక్స్) కేసులు ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి?

పాక్సొ కేసు నిందితుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు. నాకు జైలులో పరిచయమైన పాక్సొ కేసు నిందితుల్లో కొందరు తాము అమ్మాయిని తీసుకెళ్ళాం కానీ రేప్ చెయ్యలేదు అంటున్నారు, కొందరు అమ్మాయి వయసు ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేసినవాళ్ళు. బాల్య వివాహం కోసం అమ్మాయిని తీసుకెళ్తే కిడ్నాప్ కేస్ మాత్రమే ఋజువు అవుతుంది, పాక్సో కేస్ ఋజువు అవ్వదు. ఎవడైనా తాను అమ్మాయి వయసు ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేసానని చెపితే కోర్ట్ నమ్మదు. అతను కోర్ట్‌లో తాను ఆ పని చెయ్యలేదని చెపుతాడు.

పాక్సో కేసు ఋజువైతే మినిమం మూడేళ్ళు కారాగార శిక్ష పడుతుంది. గుప్త రోగం అంటిస్తే మాక్సిమం జీవిత కారాగార శిక్ష పడుతుంది. గర్భం మొయ్యలేని వికలాంగురాలికి కడుపు చేసినా జీవిత కారాగార శిక్ష పడుతుంది. గుప్త రోగం అంటించకపోయినా లాయర్ పాక్సో కేస్ నిందితుడికి అరవైడబ్బై  వేలు ఫీ అడుగుతాడు, వికలాంగురాలికి కడుపు చెయ్యకపోయినా లాయర్ అంతే ఫీ అడుగుతాడు. పేదవాడు అంత ఫీ కట్టలేడు, లాయర్ ఫీ ఇవ్వకపోతే వాదించడు. నిందితుడి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకి రాకపోతే నిందితుడి స్టేట్మెంట్ రెకార్డ్ చేసి కేస్ విచారిస్తారు. అయినప్పటికీ లాయర్‌ని పెట్టుకోవడానికి కోర్ట్ నిందితుడికి సమయం ఇస్తుంది.

చదువు రానివాళ్ళ దగ్గర ఏజ్ ప్రూఫ్‌లు ఉండవు. పాక్సో కేస్ బాధితురాలు చదువురానిది అయినా కేస్ వాయిదా పడిపోతుంది.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది