Posts

Showing posts from March, 2023

ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం BJP అభిమానులకి అవసరమా?

 మన వ్యక్తిగత శత్రువులు ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకుందాం. "వాళ్ళు ఎలా పోతే మనకెందుకు?" అనుకుంటాం. మరి మన రాజకీయ శత్రువుకి ఎవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చెయ్యొచ్చా? సంజయ్ గాంధీ ఫిరోజ్ గాంధీకే పుట్టాడు. అతను పుట్టిన 14 ఏళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు, తరువాత అతని తండ్రి చనిపోయాడు. ఇందిరా గాంధీ ఒక ఆర్మీ ఆఫీసర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని సంజయ్ గాంధీని కనిందని వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నవాళ్ళ మీద నెహ్రు కుటుంబ సభ్యులు పరువు నష్టం కేస్ వెయ్యలేదు కానీ మోదీ అనే ఇంటి పేరుని రాహుల్ గాంధీ కించపరిచాడని BJP ప్రభుత్వం అతనికి రెండేళ్ళు జైలు శిక్ష వెయ్యించింది. మనం వేరే వాళ్ళ గురించి ఎంత చెత్త ప్రోపగాండా అయినా చెయ్యగలిగినప్పుడు వాళ్ళు మన ఇంటి పేరుని ఉచ్చరిస్తే మాత్రం సహించలేమా? దున్నపోతు ఈనింది అని ఒకడంటే ఇంకొకడు దూడని కట్టెయ్యమన్నాడు. సంజయ్ గాంధీ పుట్టిన పద్నాలుగేళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు. అతని తల్లి మొగుణ్ణి వదిలేసి ఒక ఆర్మీ ఆఫీసర్‌కి అతన్ని కనిందని ఎవరో రాస్తే మిగితావాళ్ళు అన్‌క్రిటికల్‌గా నమ్మేసారు. మన శత్రువులు అక్రమ సంబంధాలు పెట్టుకుం

నా వెనుక నాగావళి నది, రాయగడ పట్టణం

Image
 ఇది రాయగడ పట్టణం దగ్గర బాయిసింగ్ కొండ నుంచి తీసిన ఫొటో  

జాతకాలు చెప్పుకుని బతికిన సైంటిస్ట్ - టైకో బ్రాహి

 జ్యోతిషం వేరు, ఖగోళ శాస్త్రం వేరు. ఒకప్పుడు సైంటిస్టులు కూడా జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు, కొంత మంది సైంటిస్టులు జాతకాలు చెప్పుకుని బతికేవాళ్ళు కూడా. అలాంటివాళ్ళలో ఒకడు టైకో బ్రాహి. సూర్య గ్రహణం ప్రతి 177 రోజులు 4 గంటలకి ఒకసారి జరుగుతుంది. కొన్ని సార్లు సంవత్సరానికి ఐదు సూర్య గ్రహణాలు జరుగుతాయి కానీ అలాంటి సంవత్సరాలు గత ఐదు వేల సంవత్సరాల కాలంలో 25 మాత్రమే. ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిషులు వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డులు సంపాదించి గ్రహణాలు ఎప్పుడొస్తాయో చెప్పగలుగుతుంటారు. ఈ విషయం తెలియక జనం జ్యోతిషులని అపర మేధావులు అనుకుంటారు. గ్రహణాలు చూడకూడదని మనం నమ్ముతాము కానీ జ్యోతిషులు గ్రహణాలు చూస్తారు. ఒక రోజు టైకో బ్రాహి సూర్య గ్రహణం చూస్తున్నప్పుడు గ్రహణాలు సైక్లికల్‌గా జరుగుతుంటాయని అతనికి డౌట్ వచ్చింది. అతను వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డుల్ని సంపాదించి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను తురక చక్రవర్తి సులేమాన్ చంద్ర గ్రహణం రోజు చస్తాడని జాతకం చెప్పాడు. అప్పట్లో యూరోపియన్ రాజులకీ, తురక సామ్రాజ్యవాదులకీ మధ్య యుద్ధాలు జ

నేను కొత్తగా కడుతున్న కోట - ద శాతో ఆఫ్ ఎడ్మండ్ డాంటిస్

Image
ఫ్రెంచ్ భాషలో శాతో అంటే కోట. నా ఫేవరిట్ హీరో ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలోని ఎడ్మండ్ డాంటిస్. అందుకే నా ఫాం హౌస్‌కి ద శాతో ఆఫ్ ఎడ్మండ్ డాంటిస్ అని పేరు పెట్టాను.   

పెళ్ళిలో బ్రాహ్మణుల వండింది తిని దళితుల పాకలో మద్యం తాగుతారు

కొంత మంది పెళ్ళి భోజనాలలో బ్రాహ్మణుల చేతే వంట చెయ్యిస్తారు. బ్రాహ్మణులు పరిశుభ్రంగా వండుతారని వాళ్ళ నమ్మకం. బ్రాహ్మణులు నడిపే హొటెల్స్‌లో కూడా లూజ్ పామాయిల్‌తో వంట చేస్తారు తప్ప రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడరు. ఒడియా, బెంగాలీ, కశ్మీరీ, కోంకణీ & కేరళ బ్రాహ్మణులు మాంసం తింటారు. ఒడిశాలోని రాయగడ పట్టణంలో పెళ్ళి భోజనాల్లో వంటలు చేసేవాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు. వాళ్ళు పెళ్ళి భోజనాల్లో మాంసం వండుతారు కానీ అన్‌హెల్దీ కండిషన్‌లో. మనం ఇంటిలో చేపల్ని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి మధ్య ఉడకబెడతాం. పెళ్ళి భోజనాల్లో వంటలు చేసేవాళ్ళు చేపల్ని నూనెలో ముంచి వేపుతారు, వేస్ట్ నూనెని వంకాయల్లో కలుపుతారు. ఆ వంకాయల్ని పెరుగులో ముంచి అవి పెరుగువంకాయలని చెప్పి అతిథులకి పెడతారు. జైల్ కీంటీన్ కాంట్రాక్టర్లు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు వేస్ట్ నూనెని పప్పులో కలుపుతారు. కైదీలకీ, విద్యార్థులకీ వేరే దారి దొరక్క ఆ ఫుడ్ తింటారు. పంచముడు వండిన ఆహారం తినకూడదు అని మనం అనుకుంటాము కానీ పంచముడి కుటీరంలో మద్యం తాగేటప్పుడు అలాంటి పట్టింపులు అడ్డురావు. మా పక్క గ్రామంలోనే సొంత వ్యవసాయ భూమి ఉన్న కులంవాళ్ళు భూమి లేని పం