ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం BJP అభిమానులకి అవసరమా?

 మన వ్యక్తిగత శత్రువులు ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకుందాం. "వాళ్ళు ఎలా పోతే మనకెందుకు?" అనుకుంటాం. మరి మన రాజకీయ శత్రువుకి ఎవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చెయ్యొచ్చా? సంజయ్ గాంధీ ఫిరోజ్ గాంధీకే పుట్టాడు. అతను పుట్టిన 14 ఏళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు, తరువాత అతని తండ్రి చనిపోయాడు. ఇందిరా గాంధీ ఒక ఆర్మీ ఆఫీసర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని సంజయ్ గాంధీని కనిందని వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నవాళ్ళ మీద నెహ్రు కుటుంబ సభ్యులు పరువు నష్టం కేస్ వెయ్యలేదు కానీ మోదీ అనే ఇంటి పేరుని రాహుల్ గాంధీ కించపరిచాడని BJP ప్రభుత్వం అతనికి రెండేళ్ళు జైలు శిక్ష వెయ్యించింది. మనం వేరే వాళ్ళ గురించి ఎంత చెత్త ప్రోపగాండా అయినా చెయ్యగలిగినప్పుడు వాళ్ళు మన ఇంటి పేరుని ఉచ్చరిస్తే మాత్రం సహించలేమా?

దున్నపోతు ఈనింది అని ఒకడంటే ఇంకొకడు దూడని కట్టెయ్యమన్నాడు. సంజయ్ గాంధీ పుట్టిన పద్నాలుగేళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు. అతని తల్లి మొగుణ్ణి వదిలేసి ఒక ఆర్మీ ఆఫీసర్‌కి అతన్ని కనిందని ఎవరో రాస్తే మిగితావాళ్ళు అన్‌క్రిటికల్‌గా నమ్మేసారు. మన శత్రువులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారో వాళ్ళకే తెలియకుండా పోతుంది. దాని వల్ల మనకేమీ నష్టం లేదు, దాని గురించి మనం పట్టించుకోవడం అవసరమా?

 నా వ్యక్తిగత శత్రువుల కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ఆమె మొగుడు వదిలేసాడు. అతనికి మూర్ఛ రోగం ఉంది, అతను తన భార్య చేతబడి చేస్తుందనుకుని వదిలేసాడు. ఆమె తల్లితండ్రులతో నాకు ఆస్తి గొడవలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు చేతబడులు చేస్తున్నారని చెపితే నేను నమ్మలేదు. నాకు ఆస్తి ముఖ్యం. వాళ్ళకి చేతబడులు తెలియనంతమాత్రాన నా ఆస్తిలో ఏ ముక్క కూడా వాళ్ళ కోసం వదులుకోలేను. ఆస్తి గొడవలు ఉన్నవాళ్ళని ఆస్తి విషయంలోనే దెబ్బతియ్యాలి. వాళ్ళు చేతబడులు చేస్తున్నారనో, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారనో చెపితే నమ్మాల్సిన అవసరం లేదు. మరి మన రాజకీయ శత్రువుల గురించి అలాంటి వదంతులు వస్తే నమ్మొచ్చా?

కాంగ్రెస్‌కి, బి.జె.పి.కి మధ్య అజెండాలో పెద్ద తేడా లేదు. బి.జె.పి. మతం పేరుతో దేశాన్ని దోచుకునే పార్టీ. కాంగ్రెస్ అప్పుడప్పుడు మత ఘర్షణలు సృష్టించే పార్టీ. మతం పేరు చెప్పుకోకుండా దేశాన్ని దోచుకోవడం సాధ్యమే కానీ మతం పేరుతో అది ఇంకా సులభంగా చెయ్యొచ్చు. బి.జె.పి. మాఫీ చేసిన మొండి బకాయీలన్నీ కాంగ్రెస్ కాలంలో ఇచ్చిన ఋణాలు అని బి.జె.పి. అభిమానులు అంటున్నారు. వీళ్ళకి మొండి బకాయీలు మాఫీ చెయ్యడం తప్పనిపించలేదు కానీ ఋణాలు ఇవ్వడంలోనే అవినీతి కనిపించింది. మతం పేరుతో జనాన్ని గుడ్డివాళ్ళని చెయ్యడం ఇంత సులభం. కాంగ్రెస్‌కి, బి.జె.పి.కి మధ్య అజెండాలో తేడా లేనప్పుడు కాంగ్రెస్ నాయకుల గురించి బూతులు ప్రచారం చెయ్యడం ఎందుకు?

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది