మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట
2017లో నేను ఒడిశాలోని ఒక ఆదివాసీ గ్రామం దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు ఒక కాపువాడు తారసపడ్డాడు. అప్పుడు నా వయసు 34 ఏళ్ళు. అతను నాకు పెళ్ళయ్యిందా అని అడిగాడు. కాలేదని చెప్పాను. అతను నమ్మలేదు. అతను అన్నాడు "ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. ఆ కులంలో ఆడపిల్లలు తక్కువ (రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుడితే పాలు సరిగా పట్టరు). వ్యవసాయం చేసేవాళ్ళలో ఆడపిల్లలకి అంత కరువు ఉండదు" అని. అతను చెప్పింది నాకు అర్థమైపోయింది. హిందు మతం అనేది కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టినది. కోమటోళ్ళు, బాపనోళ్ళలో ఆడపిల్లల సంఖ్య తక్కువే ఉంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని ఈనాడు పత్రికలో రాస్తే మా అమ్మ నమ్మేసింది. మా అమ్మగారి తండ్రి చేసినది వ్యవసాయమే కానీ మా అమ్మ బాపనోళ్ళ అమ్మాయిల కలిసి చదువుకుంది. వ్యవసాయం చేసేవాళ్ళ సంస్కృతి మా అమ్మకి తెలియదు. 2013లో ఈనాడు పత్రికలో మెయిన్ పేజ్లోనే ఒక ఆర్టికల్ ప్రచురితమయ్యింది. ఆ ఆర్టికల్లో వ్యవసాయం చేసేవాళ్ళకి, నిరుద్యోగులకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని రాసారు. వ్యవసాయం చేసేవాళ్ళు వేరు, నిరుద్యోగులు వేరు. ఇండ
Comments
Post a Comment