దళితవాదులకి ఉన్న కామన్ సెన్స్ స్త్రీవాదులకి లేదా?

 ఆ మధ్య కలేకూరి ప్రసాద్ గారు "ఆంధ్ర ప్రదేశ్ దళితులు" అనే పుస్తకం రాసారు. కొంత మంది "ఈ రోజుల్లో కుల వివక్ష లేదు" అని చెప్పి రిజర్వేషన్‌ని రద్దు చెయ్యాలంటున్నారు, ఆట్రోసిటీ చట్టాన్ని కూడా రద్దు చెయ్యాలంటున్నారు. అలాంటివాళ్ళని కౌంటర్ చెయ్యడానికి కలేకూరి ప్రసాద్ గారు ఆ పుస్తకం రాసారు. మరి "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు" అని చెప్పి ఐ.పి.సి. 498ఎ ని రద్దు చెయ్యించాలనుకునేవాళ్ళ మీద స్త్రీవాదులకి ఇంత వ్యతిరేకత ఉందా?

మా చిన్నప్పుడు స్వాతి అనే ఒక సపరివార బూతు పత్రికలో రాసేవాళ్ళు "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదట! జనం సెక్స్ గురించి ఫ్రీగా మాట్లాడుకుంటున్నారట!" ఇది నిజం అని నమ్మి ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడితే అతన్ని చెప్పుతో కొట్టేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా అలా కొడతారు. ఇలాంటి తప్పుడు ప్రోపగాండా చేసిన వేమూరి బలరాం మీద ఒక్క స్త్రీవాదికి కూడా కోపం లేదు.

వేశ్యల దగ్గరకి వెళ్ళడం తప్పు కానీ ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పు కాదు. నేను ఎయిడ్స్ గురించి మాట్లాడితేనే "నిన్ను ఎవరు అడిగారు" అని నన్ను తిట్టినవాళ్ళు ఉన్నారు. మనం నిజంగా సెక్స్ గురించి మాట్లాడితే మనకి చెప్పు దెబ్బలు కొట్టరా? జనంలో ఎయిడ్స్ గురించి అవేర్నెస్ పెరిగితే వేశ్యల దగ్గరకి వెళ్ళేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. నేను జనంలో అవేర్నెస్ పెంచడానికి ఎయిడ్స్ గురించి మాట్లాడాను తప్ప నేను ఎన్నడు వేశ్యల దగ్గరకి వెళ్ళలేదు. మనం ఎయిడ్స్, గుప్తరోగాలు గురించి మాట్లాడితేనే బూతులు మాట్లాడుతున్నామని జనం అనుకుంటారు. ఇక నిజంగా సెక్స్ గురించి మాట్లాడితే జనం మనల్ని పిచ్చొళ్ళు అనుకుంటారు.

లింగ వివక్ష పోవాలని కోరుకోవడం వేరు, ఈ రోజుల్లో లింగ వివక్ష లేదని బుకాయించడం వేరు. స్వాతి పత్రికలో ఆ బుకాయింపు ప్రోపగాండా జరుగుతున్న రోజుల్లో పెళ్ళైన హిందు స్త్రీకి ఆస్తిలో వాటా ఇవ్వక్కరలేదని చట్టం చెప్పేది. పెళ్ళైన హిందు స్త్రీకి ఆస్తిలో వాటా ఇవ్వాలనే చట్టం ఈ మధ్య వచ్చింది తప్ప నేను స్వాతి పత్రిక చదివిన రోజుల్లో మాత్రం కాదు. ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కేవలం సెక్స్ వల్ల స్త్రీ-పురుష సమానత్వం వస్తుందని చెపితే ఎవరూ నమ్మరు. అందుకే స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు కూడా స్వాతి పత్రిక చదివేవాళ్ళు, అది రాష్ట్రంలోనే అత్యధిక సర్క్యులేషన్ గల వార పత్రిక అయ్యింది.Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది