వేరేవాణ్ణి మెంటలోడనుకుని వితండవాదం చేస్తే ఇలాగే అవుతుంది


 పన్నెండు చక్రాల లారీకి న్యూట్రల్‌తో సహా 11 గేర్లు ఉంటాయి. పది చక్రాల టిప్పర్‌కి కూడా అన్నే గేర్లు ఉంటాయి. కొంత మంది ట్రాక్టర్ డ్రైవర్లు నన్ను మెంటలోడనుకుని ఏ బండికైనా ఐదే గేర్లు ఉంటాయని వాదించారు. "బండికి ఎన్ని చక్రాలు ఉంటే అన్ని గేర్లు ఉంటాయనుకున్నావా?" అని నన్ను వెక్కిరించారు. నేను యూట్యూబ్ వీడియోలు చూస్తే టాటా ట్రిపల్ ఏక్సల్ టిప్పర్‌కి కూడా 11 గేర్లు ఉంటాయని తెలిసింది. మహీంద్రా ట్రాక్టర్‌కి టాప్ గేర్‌లో రివర్స్‌తో సహా ఐదు గేర్లు ఉంటాయి, చిన్న గేర్‌లో న్యూట్రల్‌తో సహా మూడు గేర్లు ఉంటాయి. వీళ్ళు లారీకి కూడా ఐదే గేర్లు ఉంటాయనుకున్నారు. న్యూ హాలండ్ ట్రాక్టర్‌కి చిన్న గేర్ (లోడ్ గేర్) దగ్గరదగ్గరగా టాప్ గేర్ సైజ్‌లో ఉంటుంది. వీళ్ళు న్యూ హాలండ్ ట్రాక్టర్ డ్రైవర్లు.

2015లో మా ఊరి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌తో బస్సు తోలించారు, ఆ బస్సు పల్టీ అయ్యి డ్రైవర్‌తో సహా ఇద్దరు చనిపోయారు. దాని గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్లు నాతో వితండవాదం చేసారు. ట్రాక్టర్ ఇరుకైన ఘాట్ రోడ్‌లో కూడా సులభంగా టర్న్ అవుతుంది. బస్సు కూడా అంత సులభంగా టర్న్ అవుతుందని ఆ ట్రాక్టర్ డ్రైవర్ అనుకున్నాడు. ఆ బస్సు ఘాట్ రోడ్‌లోనే పల్టీ అయ్యింది. ట్రాక్టర్‌కి, బస్సుకి బ్రేకులు కూడా వేరు. ట్రాక్టర్‌వి హైడ్రాలిక్ బ్రేకులు. ఘాట్‌రోడ్ ఎక్కేటప్పుడు ట్రాక్టర్ చిన్న గేర్‌ని Hలో పెట్టి టాప్ గేర్‌ని ఫస్ట్‌లో పెట్టాలి. గేర్లు వెయ్యాల్సిన దగ్గర బ్రేకులు వేస్తే ట్రాక్టర్ పల్టీ అవుతుంది. బస్సువి ఎయిర్ బ్రేకులు. బస్సు డ్రైవర్ చేత ట్రాక్టర్ తోలిస్తే పొరపాటున అతను గేర్లు వెయ్యాల్సిన దగ్గర బ్రేకులు వేస్తాడు, ట్రాక్టర్ కూడా పల్టీ అవుతుంది.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది