మూడెకరాల రైతు - వాయిదాకి కోటికి పైగా తీసుకునే లాయర్లు

 చంద్రబాబు నాయుడు ఎలెక్షన్ వచ్చినప్పుడు తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు. గెలిచిన తరువాత వ్యవసాయం వేస్టు అనేవాడు. ఐ.టి., టూరిజం తప్ప ఏదీ అవసరం లేదు అనేవాడు. మళ్ళీ ఎలెక్షన్ టైమ్‌కి తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు. ఇప్పుడు స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు లాయర్ తన లాయర్‌కి కట్టే ఫీజ్ వాయిదాకి కోటి రూపాయలు పైనే. కంటెస్ట్ ఫీజ్ ఎన్ని కోట్లో చెప్పలేదు. మూడెకరాల రైతు ఇంత ఖరీదైన లాయర్‌లని పెట్టుకుంటాడంటే ఏ చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు నమ్మాలి?

నాకు అర ఎకరం చెరువు కలిపి మూడెకరాల భూమి ఉంది. 57 సెంట్ల భూమి గొడవలో నేను ఒక వ్యక్తి మీద పెప్పర్ స్ప్రే కొట్టాను. ఆ కేస్‌లో నాకు బెయిల్‌కి పది వేలు, వాయిదాకి వెయ్యి, అక్యూజ్డ్ స్టేట్మెంట్‌కి పాతిక వేలు తీసుకున్నాడు మా లాయర్. ఆ ఫీజ్ మా అమ్మే కట్టింది, ఆవిడ రిటెయిర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల. మూడెకరాల భూమి ఉన్నవాడు ఇంత కంటే ఖరీదైన లాయర్ దగ్గరకి వెళ్ళడు.


Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది