ఎరవాడ జైలులో కసబ్‌కి ఎన్నడూ బిర్యానీ మేపలేదు

 ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కి ఎరవాడ జైలులో ఎన్నడూ బిర్యానీ మేపలేదు. అప్పట్లో అధికారంలో ఉండిన కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టడానికి బి.జె.పి. ఇప్పుడు కూడా కసబ్‌కి బిర్యానీలు మేపారనే ప్రచారం చేస్తోంది. కసబ్‌కి బిర్యానీలు మేపలేదు అనడానికి సాక్షి ఐ.పి.ఎస్. ఆఫీసర్ మీరన్ బోర్వంకర్. ఆవిడ తన పుస్తకం "కమిషనర్ మేడం"లో కసబ్‌కి ఒక్కసారి కూడా బిర్యానీ పెట్టలేదని రాసారు. జైల్ అధికారులు, జైల్ బయటి అధికారులు తప్పుడు ప్రచారం చేసారని కూడా రాసారు. తాను ఆ టైమ్‌లో అనేక మంది ఆఫీసర్ల ఫోన్లు లాక్కున్నానని కూడా రాసారు.

జైల్‌లో కైదీలకు బిర్యానీలు మేపుతారు అని తప్పుడు ప్రచారం చెయ్యడం వల్ల ఏమి జరిగింది? బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళని జైల్‌లో పెడితే వీళ్ళకి బిర్యానీలు మేపుతారు కనుక వీళ్ళని ఎంకౌంటర్‌లో చంపెయ్యడం బెటర్ అనేవాళ్ళు తయారయ్యారు. ఈ లింక్ చదవండి: http://montecristo.freedomlover.net.in/2022/12/blog-post.html


Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది