కుల నిర్మూలనకి మార్గం అది కాదు

 కులం పోవాలంటే హిందు మతం పూర్తిగా పోవాలి. బాపనోళ్ళు రాసిన పురాణాల్లోని విలన్లని హీరోలుగా ఊహించుకోవడం వల్ల కులం పోదు. పురాణాలు అన్నీ కల్పితాలు. రాముడు పుట్టాడని బాపనోడు నిరూపించలేడు. రావణుడు పుట్టాడని దళితుడు నిరూపించలేడు. నిరూపించగలిగే దాన్ని ఎవరూ పురాణం అనరు. నిరూపణతో సంబంధం లేకుండా నమ్మే దాన్నే పురాణం అంటారు. దసరా నాడు రావణ దహనం చేసేవాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఎంత తక్కువ ఉంటుందో, రావణ దహనాన్ని అడ్డుకుంటామనేవాళ్ళకి కూడా సైంటిఫిక్ టెంపర్ అంతే తక్కువ ఉంటుంది, రామ దహనం చేసేవాళ్ళ సైంటిఫిక్ టెంపర్ కూడా అంతే తక్కువ ఉంటుంది.

ఎం.ఆర్.పి.ఎస్.వాళ్ళు రావణ దహనం మీద కోర్టులో కేస్ వేస్తామంటున్నారు. రాముడు, రావణుడు పుట్టారని ఎవరూ నిరూపించలేరు. నిరూపించలేని వాటి ఆధారంగా కోర్ట్ ఎలా తీర్పు చెపుతుంది?

దళితులు రావణుడు, శంభూకుడు తమకి మూల పురుషులు అని చెప్పుకుంటున్నారు. సూర్యవంశ క్షత్రియులు సూర్యుడు తమకి మూల పురుషుడని చెప్పుకుంటారు, భరద్వాజ గోత్రస్థులు భరద్వాజ మహర్షి తమ మూల పురుషుడని చెప్పుకుంటారు. ఈ కథలన్నీ నమ్మశక్యమేనా అనే సందేహం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళకి తప్పకుండా వస్తుంది.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది