ప్రభుత్వ ఉద్యోగి మంచివాడా కాదా అనేదానితో ప్రభుత్వాన్ని కూల్చేవాళ్ళకి సంబంధం ఉంటుందా?


 పోలీస్ ఆఫీసర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ ఆఫీసర్‌కి మార్క్సిజం తెలిసినంతమాత్రాన అతను కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌ని వదిలిపెట్టలేడు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీపరుడా, కాదా అనేది కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌కి సంబంధం లేని విషయం.

కొంత మంది ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు "ఉమేశ్‌చంద్ర నిజాయితీపరుడైన ఆఫీసర్ అనీ, నక్సల్స్ అతన్ని అన్యాయంగా చంపారనీ". అతనేమీ అంత నిజాయితీపరుడు కాదు. అతను కరీమ్నగర్ ఎస్.పి.గా ఉన్నప్పుడు చాలా మంది సస్పెండెడ్ కానిస్టెబుళ్ళపై సస్పెన్షన్ ఎత్తివేసాడు. నక్సల్స్ చేసేది శ్రమిక వర్గ పోరాటం. పోలీస్ ఆఫీసర్ చేత నిజాయితీగా పని చెయ్యించడం నక్సల్స్ పని కాదు. ఒక ఆఫీసర్ దొరికిపోయిన నక్సల్‌ని కోర్టులో హాజరుపరచకుండా ఎక్స్‌ట్రా జుడిషియల్ కిల్లింగ్‌లో చంపితే అలా ఎందుకు చంపావు అని ఆ ఆఫీసర్‌ని అడిగే హక్కు నక్సల్స్‌కి ఉంటుంది.

రాచరికంలో కంటే రిపబ్లిక్‌లో ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పుడు రాజు మంచివాడైనంతమాత్రాన, అతను చెరువులు & సత్రాలు కట్టినంతమాత్రాన రిపబ్లికన్లు రాచరికాన్ని కూల్చకుండా వదిలేస్తారా? పెట్టుబడిదారీ వ్యవస్థలో కంటే కమ్యూనిజంలో స్వేచ్ఛ ఎక్కువ అని నమ్మేవాడు పెట్టుబడిదారీ చట్టాల్ని ఫాలో అయ్యే ఆఫీసర్‌ని అలాగే చంపకుండా వదిలేస్తారా?

పోలీస్ వ్యవస్థ ఉన్నదే కేపిటలిజం (సొంత ఆస్తి వ్యవస్థ)ని పరిరక్షించడానికి. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీపరుడా కాదా అనేది కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌కి అనవసరమే.
Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది