దళితులు అందరు నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులా?

దళితులు అందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో నమ్మేవాళ్ళు ఉన్నారు. అలా నమ్మేవాళ్ళలో కొంత మంది నాస్తికులు, కొంత మంది మత విశ్వాసులు. హిందు మతం కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టిందని కొంత మంది చదువుకున్నవాళ్ళకి కూడా తెలియదు. దీన్ని అడ్వాంటెజ్‌గా తీసుకునే కొంత మంది ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదని వాదిస్తారు.

దళిత రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ పంతులు సమేతంగా పూజలు చెయ్యడంపై కొంత మంది బహుజనవాదులు ఆశ్చర్యపోతున్నారు, కొంత మంది బహుజనవాద వ్యతిరేకులు వెక్కిరిస్తున్నారు. దళితులందరు నాస్తికులు కానప్పుడు ఇక్కడ ఆశ్చర్యపోవడానికో, వెక్కిరించడానికో ఏముంది?

హిందు మతం కుల వ్యవస్థని సమర్థించడానికి పుట్టిందని తెలియక మా ఊరిలోనే ఆదివాసులు దసరా జాతర నిర్వహిస్తున్నారు. దీపావళి నాడు మా ఊరిలో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టేది దళితవీధి వాసులు. రావణుడు తమ తాత అని చెప్పి రావణ దహణాన్ని అడ్డుకుంటాం అనే బహుజనవాదులు దీని గురించి ఏమి చెపుతారు? మా ఊరిలో రెండు వీధులు ఉన్నాయి. ఒకటి ఆదివాసి వీధి, ఒకటి దళిత వీధి. దళితుల కంటే ఆదివాసులకి వ్యవసాయ భూమి ఎక్కువ. ఇక్కడ కొంత మంది ఆదివాసులు దళితుల ఇంటిలో భోజనం చెయ్యరు. ఈ విషయం తెలియక కొంత మంది దళితులు దీపావళి నాడు ఆదివాసులని ఇంటి భోజనానికి పిలుస్తుంటారు. అక్కడికి కొంత మంది ఆదివాసులు వెళ్తారు, కొంత మంది ఆదివాసులు వెళ్ళరు.

నేను మార్క్సిస్ట్‌ని. ఇండియాలో చాల మందికి మార్క్సిజం తెలియదు. ప్రభుత్వాన్ని కూల్చే రహస్యాన్ని ప్రభుత్వం బయట పడనివ్వదు కనుక మార్క్సిజం తెలియకపోవడం తప్పు కాదు. పేద ప్రజలు అందరికి మార్క్సిజం తెలుసు అని నేను అనుకుంటే ఎలా ఉంటుందో దళితులందరికీ హేతువాదం తెలుసు అని దళితవాది అనుకుంటే అలాగే ఉంటుంది. హిందు మతాన్ని కూల్చే రహస్యాన్ని కూడా హిందుత్వవాదులు బయటపడనివ్వరు. అందుకే వాళ్ళు ఈ రొజుల్లో కులాలు లేవనీ, లింగ వివక్ష లేదనీ వాదిస్తారు.

Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది